మనము ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు
ఎవరైనా తుమ్మితే ఆగిపోతాము అలాగే గుమ్మములో పిల్లి ఎదురైతే ఆగిపోతాము వీటి వల్ల పని అవ్వదేమో అన్న నమ్మకము ఇలాంటి నమ్మకాలను మూఢ నమ్మకాలు అంటారు. మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని
నమ్మకాలు మంచిని పెంచితే,
మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని “మూఢ నమ్మకాలు” అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.